Wednesday, 11 November 2026

వార్తలు

ఒడిశాలో బంద్‌ కారణంగా.. పలాసలో నిలిచిన రైళ్లు

శ్రీకాకుళం: ఒడిశాలో బంద్‌ కారణంగా శ్రీకాకుళం జిల్లా వలాసలో దురంతో, వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒడిశాలో బిజద ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.

నేడు తెదేపాలో చేరనున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటశ్వరరావు తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీలో…

బీహార్‌లో పడవ ప్రమాదం

పాట్నా: బీహార్‌లోని బోజ్‌పూర్‌ జిల్లా కౌరా సమీపంలోని సోన్‌ నదిలో సోమవారం ఉదయం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 35 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం గాలింపు  చర్యలు…

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన కూడంకుళం, సెప్టెంబరు 09 (జనంసాక్షి) : తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. పీఎంకే ఈ ర్యాలీకి మద్దతిస్తుండగా ప్రభుత్వం నిషేధాజ్ఞలు…

గులాంనబీ ఆజాద్‌తో ముగిసిన సీఎం భేటీ

హైదరాబాద్‌: లేక్‌ వ్యూ అతిధి గృహంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ అజాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటన్నరకుపైగా ఆజాద్‌తో సీఎం చర్చించారు. రాష్ట్ర రాజకీయాలు, పర్టీ పరిస్థితి నామినేటెడ్‌…

త్రుటిలో తప్పిన రైలు ప్రమాదం

నెల్లూరు: కావలి మండలం ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై ఇనుప ప్లేటును పెట్టారు. ఈ ఘటనలో దురంతో ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెను ప్రమాదంతప్పింది. రైల్యే భద్రతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

ఓపెన్‌ ఫైనల్లో జకోవిచ్‌ విజయం

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు జకోవిచ్‌ దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో డేవిడ్‌ ఫెర్రర్‌పై 2-6, 6-1, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ముర్రేతో జకోవిచ్‌ తలపడనున్నాడు.

బాబా రాందేవ్‌ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత కుట్ర

న్యూఢిల్లీ: భారత్‌ స్వాభిమాన్‌ మంచ్‌ కార్యకర్త రాజీవ్‌ దీక్షిత్‌ మృతి, తన గురువు శంకర్‌ దేవ్‌ అదృశ్యం కేసుల్లో తనను ఇరికించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు కుట్ర పన్నుతున్నారని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఆరోపించారు.…

ఇరాక్‌ ఉపాధ్యక్షుడు తారిఖ్‌కు ఉరి శిక్ష

బాగ్దాద్‌: రెండు హత్యలతోపాటు దేశంలో మతతత్వ శక్తులు రెచ్చిపోవడానికి కారణమయ్యారని ఇరాక్‌ ఉపాధ్యక్షుడు తారిఖ్‌ అల్‌ హషేమికి ఉరిశిక్ష విధిస్తూ స్థానిక క్రిమినల్‌ కోర్టు ఆదివారం తార్పు చెప్పింది. హత్యకేసులో నిందితుడిగా గుర్తించడంతో ఈ ఏడాది తొలినాళ్లలో హషేమి…

పాక్‌ పర్యటనపై ఎన్‌.ఎం.కృష్ణ సంతృప్తికరం

లహోర్‌: మూడు రోజుల పాక్‌ పర్యటనపై భారత విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌తో నమ్మకమైన సంబంధాలను పెంపొందించుకునేందుకు తన పర్యటన దోహదపడిందన్నారు. పాక్‌ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని అష్రాఫ్‌, విదేశాంగ మంత్రి రబ్బానీలతో జరిపిన…