Wednesday, 11 November 2026

వార్తలు

ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా

ఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో ఈ రోజు బొగ్గు గనుల కేటాయింపులపై గొడవ కొనసాగింది. ఇందుకు ప్రధానే కారణమని ఆయన రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సభలను జరగనిస్తే చర్చిద్దామని ఉభయసభల స్పీకర్లు చెప్పినా వారు వినకుండా ఆందోళన చేయటంతో…

సింహాద్రి ఎన్‌టీపీసీకి బొగ్గు కొరత

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడలో ఉన్న సింహాద్రి ఎన్‌టీపీసీలో బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో 1500 మోగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఈ యూనిట్‌లో విద్యుదుత్పత్తిని 1300 మెగావాట్లకు కుదించారు.

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో  ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

నల్గొండ మాజీఎంపీ ఇంట్లో చోరీ

నల్గొండ మాజీఎంపీ అకారపు సుదర్శన్‌ ఇంట్లో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రూ.4లక్షల విలువ   చేసే నగలు, రూ లక్ష నగదును దోచు కెళ్లారు. మాజీ ఎంపీ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు…

నేడు ఆజాద్‌, షిండేలతో తెలంగాణ జేఏసీ భేటీ

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం సబీ ఆజాద్‌ను తెలంగాణ జేఏసీ నేతలు మధ్యాహ్నం కలువనున్నారు. తెలంగాణ మార్చ్‌ పర్యవసానాలను వివరించి, ఆలోపే తెలంగాణపై నిర్ణయం  తీసుకోవాలని, లేనిపక్షంలొ జరుగబోయే పరిణామాలకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని…

బొగ్గు కొరతతో కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి

వరంగల్‌: కాకతాయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (కేటీపీఎస్‌)లో బొగ్గు నిల్వలు తగ్గడంతో విద్యుదుత్పత్తి సగానికి పడిపోయింది. 500 మెగావాట్ల ఉత్పత్తికిగాను 300 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే చేస్తున్నాట్లు అధికారులు తెలియజేశారు.

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 85 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 30 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లతో రూపాయి మారక విలువ 17 పైసలకి తగ్గి…

మూడో రోజుకు చేరిన జూడాల సమ్మె

హైదరాబాద్‌: డిమాండ్ల సాధన కోసం చేపట్టిన జూనియర్‌ వైద్యుల సమ్మె మూడో రోజకు చేరింది. మంగళవారం రాత్రి పదిన్నర వరకు సచివాలయంలో వైద్య ఆరోగ్య కార్యదర్శి రత్నకిశోర్‌తో జూడాలు జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వాను పత్రుల్లో సేవల…

నేడు కర్నూలు జిల్లాలో సీఎం రెండో రోజు పర్యటన

కర్నూలు: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం  కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వ్యవసాయ గోదాములను సీఎం అందుబాటులోకి  తేనున్నారు. 10 గంటలకు…

14 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: ఈ నెల 14వ తేదీ నుంచి బీఎడ్‌ ప్రవేశాల కోసం (ఎడ్‌సెట్‌-2012) వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఎడ్‌సెట్‌  కన్వీనర్‌ వెంకట్రావు ఈ మేరకు తెలియజేశారు.