Wednesday, 11 November 2026

వార్తలు

ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలపై నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలపై సానుకూలంగా స్పందించాలని తాను కర్ణాటక సీఎంను కోరానని తప్పక పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని భాజపా సీనియార్‌ నేత వెంకయ్యనాయుడు ఈరోజు ఢిల్లీలో తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని…

బెంగళూర్‌లో క్లీన్‌స్వీప్‌

5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా బెంగళూర్‌ ,సెప్టెంబర్‌ 3:ఆధిపత్యం చేతులు మారుతూ రసవత్తరంగా సాగిన బెంగళూర్‌ టెస్టులో చివరికి టీమిండియానే విజయం సాధించింది. కివీస్‌ విసిరిన 261 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు…

యూరియాకోసం తోపులాట: లాఠీఛార్జీ

తాండూరు:రంగారెడ్డి జిల్లాలో యూరియాకోసం రైతుల మధ్య జరిగిన తోపులాట లాఠీఛార్జీకి దారితీసింది. తాండూరులో ఈరోజు యూరియాకోసం రైతులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. యూరియా తక్కువగా ఉన్నట్లు ప్రచారం కావటంతో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌లో కూడా రైతులు ఎరువులకోసం…

అత్తింటివారిపై గొడ్డలితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండ మండలం చిన్నవల్లూరులో ఓ అల్లుడు అత్తింటి వారిపై గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో అత్త మృతి చెందగా మరదలి పరిస్థితి విషమంగా ఉంది.అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో కుంభకోణం

అనంతపురం: జిల్లా సబ్‌ రిజష్ట్రార్‌ కార్యాలయంలో రూ.34 లక్షల కుంభకోణం జరిగింది. రాజారత్నం అనే ఉద్యోగి భూముల రిజిస్ట్రేషన్‌ను తక్కువడాచూపి 34 లక్షల కాజేసినట్లు తేలటంతో ఆథికారులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేశారు.

పన్ను చట్టంలో స్పష్టమైన విధానం : చిదంబరం

ఢిల్లీ: పన్ను చట్టంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా స్పష్టమైన విధానం తీసుకొస్తామని ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో పన్ను ఆదాయం 12 శాతం సాధించటమే లక్ష్యమని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో…

బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరు నగరంలో పోలీసులు వస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నయిమ్‌ సిద్ధిఖ్‌ అనే వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద…

కర్ణాటకకు ప్రత్యేక బలగాలు: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌: తీవ్రవాదుల అరెస్ట్‌ నేపథ్యంలో కర్ణాటకకు ప్రత్యేక బలగాలను పంపుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు. బెంగుళూరులో అరెస్టయిన హుజీ తీవ్రవాదులకు రాష్ట్రంలో సంబంధాలపై ఆరా తీస్తారని ఆయనర తెలిపారు.హుజీ తీవ్రవాదసంస్థ జాబితాలో ఉన్న జాడలు లేవన్నారు.…

రాజ్యాసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యాసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఓసారి సభ రెండు గంటలు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమైన ఇదే పరిస్థితి నెలకొంది దీంతో రేపటికి వాయిదా వేశారు.

ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం-మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది.

ఢిల్లీ: ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదంసంబవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగుతున్నట్లు అనుమానిస్తున్నారు.