Wednesday, 11 November 2026

వార్తలు

తెదేపా దీక్షను అడ్డుకున్న వైకాపా నేతలు

కృష్ణా: కృష్ణా డెల్టాకు  నీరు విడుదల చేయాలంటూ నందివాడ మండలం జనార్థనపురంలో తెలుగుదేశం పార్టీ దీక్ష చేపట్టింది. తెదేపా  దీక్షను వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పరస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు…

మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆశ్విన్‌ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు యాదవ్‌ బౌలింగ్‌లో మెక్కలమ్‌ (23),…

బోధనారుసుములపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు: బొత్స

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి బోధనా రుసుంపై మాట్లాడే హక్కు  లేదని పీసీసీ అధినేత బొత్స వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్‌ కళాశాలల్లో చదివిన వారికి బోధనా రుసుం చెల్లించాలని అడగడం సమంజసమా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బొత్స…

బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాదులు దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి పిస్తోలు, 16 బెల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత…

ఇరాన్‌లో భూకంపం

తెహ్రాస్‌: ఇరాన్‌లో తూర్పు ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. క్వేస్‌ పట్టణానికి సమీపంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ అధికారులు తెలియజేశారు. గత నెలలో ఇరాన్‌లో చోటుచేసుకున్న జంట భూకంపాల ఘటనలో…

చెప్యాలలో డెంగ్యూతో బాలుడు మృతి

మెదక్‌: మిరుదొడ్డి మండల కేంద్రంలోని చెప్యాల గ్రామంలో తలారి కృష్ణ(9) అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందినాడు. 4రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందాడు.

నవాపేటలో మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బొకారో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

యలమంచిలి, విశాఖపట్నం: ధన్‌బాద్‌నుంచి అలెప్పీ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో మంటలు రావడంతో ఈ రైలును  యలమంచిలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. స్థానికులు సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టాలు  సంభవించలేదని సిబ్బంది. తెలియజేశారు.…

వావిలాలపల్లిలో బాలిక అపహరణ

కరీంనగర్‌: వావిలాలపల్లిలో ఓ బాలిక అపహరణకు గురైంది. శ్రీనివాస్‌, భాగ్యలక్ష్మి దంపతుల కూతురు 7 నెలల చిన్నారిని రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి తన భర్త సినిమాకు వెళ్లారని, ఇంట్లో…

త్వరలోనే శాసనసభా సమావేశాలు: గండ్ర

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమరెడ్డి అన్నారు. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. విద్యుత్‌ సమస్యను విపక్షలు రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు.