Tuesday, 10 November 2026

వార్తలు

రంగాపూర్‌ గ్రామానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి మంచినీటి పథకానికి 54లక్షలు

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం రంగిమల్ల గ్రామంలో మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి 54లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేవాసరు.

చెలిమిల్ల గ్రామంలో డెంగితో 6సం|| చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం చెలిమల్ల గ్రామంలో డెంగీ వ్యాధితో తేజస్వీ(6) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న బాలికని హైదరాబాద్‌లో చికిత్స చేయించిన ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇటలీ సదస్సుకు గృహనిర్మాణ సంస్థ ఎండీ

హైదరాబాద్‌: ఇటలీలో  జరిగే ప్రపంచ పట్టణ వేదిక అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ డి. వెంకటేశం పాల్గొంటున్నారు. రేపటినుంచి 5వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. ‘ అందుబాటులో ఇళ్లు’ అనే అంశంపై వెంకటేశం…

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌

అనంతపురం: ఓఖా-ట్యుటికోరిస్‌ మధ్య  నడిచే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ రైలు సోమందేపల్లి మండలం నడింపల్లి వద్ద గంటనుంచి నిలిచిపోయింది. తాగునీరు కూడా లేదంటూ రైలు ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సభలను అడ్డుకునే తీరతాం: భాజపా

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుని తీరతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రధాని రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పింది. కేవలం బొగ్గు కుంభకోణం గురించి తాము ప్రధాని రాజీనామా కోరడం లేదని, వరసగా వెలుగులోకి వచ్చిన…

ఎస్పీవై రెడ్డి రాజీనామా ఉపసంహరణ

హైదరాబాద్‌: ఆల్మట్టినుంచి రాష్ట్రానికి నీరు విడుదల చేసినందుకు తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలిశయానికి నీరు చేరుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అర టీఎంసీ నీటిని…

సిగరేణీలో కన్వేయర్‌ బెల్టుతెగి నిలిచిన బోగ్గు రవాణ

కరీంనగర్‌: సింగరేణిలో ఓసీటీ3 సీహెచ్‌పీలో కన్వేయర్‌ తెగిపోవటంతో బోగ్గు రవాణా నిలిపోయింది. ఓసీటీ3 బంకరు నుంచి బొగ్గును రవాణా చేసే బెల్టు అకస్మాతికంగా తెగిపోయి మోటర్లు అలాగే తిరుగుతుండటంతో మంటలు లేచాయి. మరమత్తులు చేస్తున్నారు.

యువతుల అపహరణపై విచారణకు మంత్రి ఆదేశం

హైదరాబాద్‌: రామంతాపూర్‌లోనొ ఉజ్జ్వల హోమ్‌లో యువతుల అపహరణపై విచారణకు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యాదర్శులతతో ఈ విషయంపై ఆమె మాట్లాడినట్లు సమాచారం.

ఏషియాన్‌ మోగా చాంఫియన్‌ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఏషియాన్‌ మోగా చాంఫియన్‌ పోటీలను సరూర్‌:నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో భారత్‌, థాయిలాండ్‌, హాంకాంగ్‌, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, చైనా, సింగాపూర్‌ శ్రీలంక దేశాలు పాల్గొంటున్నారు.

విద్యుత్‌ కోతలకు నిరసనగా వరంగల్‌ టీడీపీ భారీ ర్యాలీ

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు నిరసనగా హన్మకొండలో టీడీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి 5జిల్లాల నాయకులు హాజరైనారు. ఎన్‌పీడీసీఎల్‌ కార్యలయం ఎదుట టీడీపీ నేతలు బైటాయించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యవల్లే విద్యుత్‌ సంక్షోబమని ఎర్రబెల్లీ దయకర్‌రావు అన్నారు.