Tuesday, 10 November 2026

వార్తలు

ముగిసిన 46వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగురోజులపాటు వివిధ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. ఈ…

విద్యుత్‌ సమస్యలపై వైకాపా ఇచ్చిన బంద్‌ స్పందన కరువు

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై వైకాపా ఇచ్చిన బంద్‌ పిలుపు విఫలమైందని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైకాపాపై ప్రజలకు నమ్మకం లేకపోవటమే ఇందుకు కారణమనా అన్నారు. బంద్‌కు ప్రజలనుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. వర్షాలు…

ఇద్దరు వ్యక్తులను గొంతుకోసి చంపిన దుండగులు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ శివారులో జంట హత్యలు సంచలనం కలిగించాయి. ఇద్దరు వ్యక్తులను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను అనంతపురం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. పాత కక్షలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురంవాసి…

అమెరికాలో వరుస కాల్పులు

అమెరికా: అమెరికాలో దారుణ మారణకాండ చోటు చేసుకుంది. న్యూజెర్సీలో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పలువురు దుర్మరణం చెందగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…

ఆట ముగిసే సమయానికి కివీస్‌ స్కోర్‌ 328

బెంగళూరు: భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మెదటిరోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 6 వికెట్ల నష్టానికి  328 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేవపోవడంతో అర గంట ముందే మ్యాచ్‌ను నిలిపివేశారు.…

నరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు శిక్ష

గుజరాత్‌: సరోడ పాటియా అల్లర్ల కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ అల్లర్లకు సంబంధించి 32 మంది దోషులకు శిక్ష ఖరారు అయింది. మాజీ మంత్రి మాయా కొడ్నానికి 18 ఏళ్ల జైలు శిక్ష,…

అసోం అల్లర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు: ప్రధాని

ఢిల్లీ: అస్లోం అల్లర్ల వల్ల ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌  అన్నారు. లోక్‌ పాల్‌ పరిధిలో ప్రధానిని తీసుకువచ్చే విషయంలో తానెప్పుడూ విముఖంగా లేనని ఆయన అన్నారు. అల్లర్ల, ఘర్షణల వల్ల  దేశ ఆర్థిక…

తెలంగాణ సాధనకోసం ఢిల్లీలో దీక్ష: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకోసం వచ్చే నెల 3,4,5 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ దీక్షలో సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ రాజ్‌ నాథ్‌సింగ్‌…

అణువిద్యుత్‌ నిర్మాణ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లో బాబా అణు విద్యుత్‌ పరిశోధన కేంద్రం నిర్మిణపనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. వెంటనే పనులు నిలిపివేయాలంటూ అధికారులను నిర్బంధించారు.

సెప్టెంబర్‌ 5న ఢిల్లీకి వెళ్లనున్నా కేసీఆర్‌

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 5న ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తతారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి కేసీఆర్‌ ఢిల్లీ  వెళ్తున్నారు అన్ని సమాచారం.