Tuesday, 10 November 2026

వార్తలు

బళ్లారి రక్షిత అటవీ ప్రాంత మైనింగ్‌ పై మరో నివేదిక

ఢిల్లీ: బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్‌ వ్యవహారాలపై అధ్యయనం చేసిన కేంద్ర సాధికార  కమిటీ సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించింది. పర్యావరణ పునరుద్ధరణ  కార్యకలాపాలను పాటించని సంస్థలను  వెంటనే నిషేధం విధించాలని సూచించింది.

వ్యవసాయ స్థితిగతులపై మంత్రి కన్నా సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ స్థితిగతులపై జిల్లా జేడీలతో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సమీక్ష జరిపారు. నిజామాబాద్‌, నల్గొండ, విశాఖ మినహా రాష్ట్రంలో వర్షపాతం బాగానే ఉందని ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు 98 శాతం భూమిని రైతులు సాగుచేశారన్నారు.…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ముగిసిన సమావేశం

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణ పై రెండు మూడు రోజుల్లో సృష్టత ఇస్తామని తెలియజేశారు. ఈ విషయమై సీమాంధ్ర నాయకులతో చర్చలు జరుపుతున్నామని చంద్రబాబు …

ఐదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌

బెంగళూరు: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 315 పరుగుల వద్ద ఫ్రాంక్లిన్‌ తన 8 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఓజా…

సిరిసిల్లలో మరో నేత కార్మికుని ఆత్మహత్య

సిరిసిల్ల: నేత కార్మికుల బలవన్మరణాలు సిరిసిల్లలో కొనసాగుతున్నాయి. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వేములవాడ మండలం నాంపల్లిగుట్టపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలనికి చేరుకొన్ని పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విద్యుత్‌ కోతలపై గవర్నర్‌ను కలవనున్న తెదేపా టీడీపీ

హైదరాబాద్‌: ప్రజాసమస్యలు, విద్యుత్‌ కోతలపై తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్‌ను కలిసి సమస్యల తీవ్రతను…

కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలోని 1,2 యూనిట్ల ప్రారంభానికి కోర్టు అనుమతి

చైన్నై: తిరునెల్వేలి జిల్లాలోని కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రానికి కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పునువెలువరించింది. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు పిటిషనర్లు తెలియజేశారు.

కేకే మార్గంలో తెగిపడ్డ విద్యుత్‌ తీగలు

విశాఖ: కొత్తవలస-కిరండోల్‌ (కేకే) మార్గంలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో చిమిలిగూడ వద్ద ప్యాసింజర్‌ రైలును అధికారులు నిలిపివేశారు. దీంతో పలు గూడ్స్‌రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పార్లమెంట్‌ ఉభయసభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం లోక్‌ సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణానికి నైతిక భాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు…

జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐరన్‌ మాత్రాలు వికటించి విద్యార్థికి అస్వస్థత

గుంటూరు: కారంపూడి ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ఐరన్‌ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆ మాత్రలు మింగిన 7వ తరగతి విద్యార్థి సాగినబోయిన వెంకటేష్‌ వాంతులతో అస్వస్థతకు గరయ్యాడు.