Tuesday, 10 November 2026

వార్తలు

మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు మధ్య కాల్పులు

రాయిపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మర్దకల్‌-సికాసర్‌ ప్రాంతంలో మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల  మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాల్పులు అనంతరం మావోయిస్టుల వద్ద నుంచి 12 తుపాకులు, ఒక డిటోనేటర్‌, 2…

కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రధాని, సోనియా భేటీ

ఢీల్లి: పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఉదయం సమావేశమయ్యారు. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో వారు చర్చిస్తున్నారు.

ముగిసిన గవర్నర్‌, ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిల భేటీ ముగిసింది. గంటన్నరపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరూ చర్చలు జరిపారు.

ఏఎస్పీతో డీఐజీ చర్చలు

కాకినాడ: తూర్పుగోదావరి ఎస్పీ త్రివక్రమవర్మపై తీవ్ర ఆరోపణలు చేసిన ఏఎస్పీ నవీన్‌కుమార్‌తో డీఐజీ సూర్యప్రకాశ్‌రావు చర్చలు చేపట్టారు. లంచగొండి ఎస్పీతో వేగలేకపోతున్నానని,తనపై వేధింపులకు పాల్పడుతూ చంపడానికి ప్రయత్నించారని నవీన్‌కుమార్‌ సోమవారం మీడియాకు తెలియజేశారు. ఎస్పీ వల్ల తనకు ప్రాణహాని…

ఫీజుల ఖరారుపై నేడు ఉప సంఘం భేటీ

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ కానుంది.ఇంజినీరింగ్‌ రుసుముల ఖరారుపై ఉపసంఘం చర్చించనుంది.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలటూరు గేటు వద్ద రెండు బస్సులు ఢీకొన్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

అసోంలో కొనసాగుతున్న అల్లర్లు

గౌహతి: అసోంలో హింస కొనసాగుతోంది. కోక్రాఝర్‌ జిల్లా ఫికిరాగ్రామ్‌ సమీపంలోని పక్రీతల్‌ గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులకు ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఫకిరాగ్రామ్‌ ఆసుపత్రికి తరలించారు. దుండగులు పలు ఇళ్లకు నిప్పు పెట్టినట్లు లా…

గ్యాస్‌ ట్యాంకర్‌ పేలి 30 మందికి తీవ్రగాయాలు

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్‌లో డివైడర్‌ను ఢీకొని గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ప్రమాదంలో 30 మందికితీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయకచర్యలు…

గూడ్స్‌రైలులో చెలరేగుతుంన్నా మంటలు

ప్రకాశం: కురిచేడు వద్ద బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యాగన్‌ దగ్దమైంది. గుంతకల్‌ వైపునకు 26 వ్యాగన్లతో బొగ్గు రైలు వెళ్తోంది. ఈ ఉదయం 10వ వ్యాగస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమతమైన …

కొనసాగుతున్న తెదేపా బృందం నిరసన

హైదరాబాద్‌: సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నిరసన కొనసాగుతోంది. దాంతో సచివాలయంలోని సీ బ్లాక్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీ బ్లాక్‌ మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. సీఎం ఛాంబర్‌లో ఎవర్ని…