Tuesday, 10 November 2026

వార్తలు

మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి: మేడ్చల్‌ జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 3 పర్యాటక బస్సులు, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 7లారీలను పట్టుకున్నారు. వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు.

చైనాలో రోడ్డు ప్రమాదం…36 మంది మృతి

బీజింగ్‌: ఉత్తర చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాంజీ ప్రాంతంలోని యానస్‌ పట్టణానికి సమీపంలో ఓ డబుల్‌డెక్కర్‌ బస్సు ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను అదుపుతప్పి ఢికొంది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.…

16వ శతాబ్దానికి చెందిన నాణేలు లభ్యం

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం కవాడీపల్లిలో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ స్టిండియా కంపెనీ నాణేలుగా వాటిని గుర్తించారు. ఓ గొర్రెల కాపరికి ఈ నాణేలు దొరికినట్లు సమాచారం.

బాలీవుడ్‌ నటుడు ఏకే హంగల్‌ కన్నుమూత

ముంబయి: పాతతరం బాలీవుడ్‌ నటుడు  ఏకే హంగల్‌ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హంగల్‌ మృతి చెందారు. దాదాపు  200 సినిమాల్లో హంగల్‌ నిటించారు.

నేడు తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ భేటీ

హైదరాబాద్‌: ఈ రోజు తెలంగాణ పబ్లిక్‌ ప్రాజిక్యూటర్స్‌ సమావేశం ఉదయం 11:30కి తాజ్‌మహల్‌ హోటల్‌లో జరగుతుంది ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌లు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నక్కల్‌ గ్రామలో విషాద సంఘటన జరిగింది. బావిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌: నగరంలో ఆదివారం ఉదయం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, హైదర్‌నగర్‌, మూసాపేట, నిజాంపేటలో వర్షంతో ప్రధాన రహదారులు తడిసిముద్దయ్యాయి.

ఎర్రచందనం స్వాధీనం

సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి పింఛ అటవిప్రాంతం నుంచి జిలెల్లమంద బీటుసున్నపుగుండు సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాథీనం చేసుకొని 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.…

నేటి నుంచి డీఎస్సీ రాతపరీక్షలు

హైదరాబాద్‌: డీఎస్సీ-2012 రాతపరీక్షలు ఆదివారం నుంచి మంగళవారం వరకు జరగనున్నాయి.21,343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా 4,23,111 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1874 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి…

ప్రధాని నివాసం వద్ద నిరసన..కేజ్రీవాల్‌ అరెస్టు

న్యూఢిల్లీ: ప్రధాన నివాసం వద్ద నిరసనకు సిద్ధమైన అన్నాహజారే బృందం సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన మద్దతుదారులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొగ్గుకుంభకోణానికి వ్యతిరేకంగా ప్రధాని, సోనియా, గడ్కరీ నివాసాల వద్ద ధర్నాకు కేజ్రీవాల్‌ సిద్ధమవుతుండగా…