Tuesday, 10 November 2026

వార్తలు

బోధనాఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో బోధనా ఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటైంది. పది మంది అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రెస్‌ మీట్‌

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పటుచేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థుతలపై ఈ సమావేశంలో ఆయన మాట్లాడన్నుట్లు సమాచారం.

వాయిలార్‌ రవితో టీ.కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

డిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు డిల్లీలో వాయిలార్‌ రవితో భేటీ అయ్యారు. ఒకటి రెండు వారాల్లో పీసీసీ పునర్‌ వ్యవస్థికరణకు కసరత్తు ప్రారంభమవుతుందని ఆయన చెప్పినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ధర్మాన రాజీనామ విషయంలో జోక్యానికి కాంగ్రెస్‌…

దేశంలో అణువిద్యుత్‌ కేంద్రాలు సురక్షితం కాదు: కాగ్‌

ఢిల్లీ: దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలు సురక్షితం కాదని కాగ్‌  పేర్కొంది. ఆకస్మికంగా ఏదైనా ఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనే వ్యవస్థ అణువిద్యుత్‌ కేంద్రాల్లో లేదని కాగ్‌ తెలిపింది. అణువిద్యుత్‌  కేంద్రాలపై కాగ్‌ ఈ రోజు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.

నిన్న అరెస్టయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: నిన్న అరెస్ట్‌ అయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మంగళవారం విద్యుత్‌సౌధ ముందు టీఆర్‌ఎస్‌ చేపట్టిన కరెంట్‌ ఆందోళన సందర్భంగా వీరు ట్రాన్స్‌కో సీఎండీ కార్యాలయంలోకి దూసుకుపోయి బైఠాయించారు. సాయంత్రం వరకు…

కరీంనగర్ లో జర్నలిస్టులపై పోలీసుల జులుం

కరీంనగర్‌:  విద్యుత్‌ కోతకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో జరిగే ముట్టడి, ధర్నా కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల దాడిలో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి నిరసనగా ఏపీయూడబ్లూజే ఆధ్వర్యంలో…

డీఎస్సీ పరిక్షకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ 2012 పరిక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పార్థసారధి తెలిపారు. 1874 కేంద్రాల్లో ఈ నెల 26,27,28 తేదిల్లో జరిగే పరీక్షకు 4లక్షల 23వేల మంది హాజరుకానున్నారు. 144సెక్షను అమల్లోఉంటుంది, 21343పోస్టుల్లో  6007 స్కూల్‌…

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించిన టీఆర్‌ఎస్‌-కేటీఆర్‌ అరెస్ట్‌

హైద్రాబాద్‌: రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించింది. టీఆర్‌ఎస్‌ నేత కెటీఆర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతులకు విద్యుత్‌ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తూ మినిస్టర్స్‌  క్వార్టర్స్‌ వద్దకు చేరుకొని పెద్ద పెట్టున…

మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి: మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: దేశంలో మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్నారు. పోషకాహారలోపం, అవగాహనారాహిత్యంతో ఏటా లక్షలాది మహిళలు మృత్యువాత పడుతున్నారని  చెప్పారు. దేశం ఆర్ధికంగా ఎదుగుతోందని గణాంకాలు…

విద్యుకోతలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై నిరసనల వెల్లువ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుగుదేశం, వామపక్షాలు సచివాలయాన్ని ముట్టడించాయి. టీడీపీ,వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ విద్యుత్‌సౌధను విడతల వారిగా ముట్టడిస్తున్నారు. పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహెందర్‌రెడ్డి,…