Tuesday, 10 November 2026

వార్తలు

గాలిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్థన్‌రెడ్డి పోలీసులు ఈ రోజు సండూరు కోర్టులో హాజరుపరిచారు. గాలిని బళ్లారి కేంద్ర కారాగారం నుంచి భారీ బందోబస్తు నడుమ సండూరు కోర్టుకు…

చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి, ముగ్గురి అరెస్టు

నెల్లూరు: ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజామున నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 56,795 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు…

చంద్రబాబుతో ఖాన్‌ భేటీ

హైదరాబాద్‌: తేదేపా అధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడుతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఆయనను కలిసినట్లు ఏకే ఖాన్‌ తెలిపారు.

నల్గొండ జిల్లాలో నార్వే బృందం పర్యటన

నల్గొండ: జిల్లాలోని వ్యవసాయ, భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో నార్వే బృందం ఈరోజు పర్యటిస్తోంది. నార్వే దేశ ఆహార, వ్యవసాయశాఖమంత్రి ట్రిగ్వే హోల్డ్‌, పొలిటికల్‌ అడ్వజైర్‌ మిన్‌ హనే, హెడ్‌ ఆఫ్‌…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో  ప్రారంభమయ్యాయి ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్‌ 80 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు లాభంలో  కొనసాగుతున్నాయి.

నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నుంచి మూడురోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాజధాని నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్మనతో జిల్లాలో ఇందిరమ్మబాట శ్రీకారం…

తల్లిదండ్రులను నరికి చంపిన కిరాతకుడు

వరంగల్‌: ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లెలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించనందునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

పోలవరంలో రాకపోకలు నిలిపివేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తోంది. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా భద్రత పేరుతో పోలీసులు పోలవరంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని 25 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేడు సండూరు కోర్టుకు గాలి జనార్ధన్‌రెడ్డి

బెంగళూరు: గనుల సరిహద్దుల ఉల్లంఘన, ప్రాణహాని బెదిరింపు కేసులో ఆరోపణలు ఎద్కుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు సండూర్‌ కోర్టులో హాజరుపచనున్నారు. భారీ భద్రత నడమ బళ్లారి కేంద్ర కారాగారం నుంచి సండూరు కోరుకు గాలిని తరలించనున్నారు.

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం

గన్నవరం: పశ్చమగోదావరి జిల్లాలో జరిగే ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం . 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయనతో పాటు మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పితాని సత్యనారాణ, సునీతా లక్ష్మారెడ్డి, ఆనవర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి శేషారెడ్డి ఉన్నారు.…