Tuesday, 10 November 2026

వార్తలు

మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం-ఫీజురీయింబర్స్‌మెంట్‌పై చర్చ

హైదరాబాద్‌: సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు పితాని సత్యనారాయణ, బసవరాజు సారయ్య తదితరులు హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లపై ఈ సమావేశంలో  చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 380 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 29, 650గా ఉంది. కిలో వెండి…

మమతా బెనర్జీపై కోర్టులో పిటిషన్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మమత వాఖ్యల వీడియోను న్యాయనిపుణులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు సీపీఐ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.

రజత పతక విజేత విజయ్‌కుమార్‌కు పదోన్నతి

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత విజయ్‌కుమార్‌కు పదోన్నతికల్పిస్తూ సైన్యం గౌరవించింది. ఒలింపిక్స్‌లో భారత్‌ సత్తా చాటిన విజయ్‌కుమార్‌కు సుబేదార్‌ మేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ సైన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

దేశ్‌ముఖ్‌ మృతికి సంతాపంగా ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: అనారోగ్య కారణంగా మృతి చెందిన కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌  నేత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఘనంగా నివాళులు ఆర్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లోటు…

డీజీపీ నియామకంపై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: డీజీపీ నియామకం విషయంలో క్యాట్‌ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామకంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. వారం రోజుల్లోగా డీజీపీ నియామక కమిటీని…

అసోంలో మరోసారి చెలరేగిన అల్లర్లు

అసోం: అసోంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎక్కడ ఎప్పుడేం జరుగుతోంది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు బస్కా జిల్లా తముల్‌పూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొందరు గుర్తు తెలియని దుండుగులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు.…

బళ్లారిలో ఏసీబీ బృందం దర్యాప్తు

బళ్లారిలో: గాలి జనార్థనరెడ్డి బెయిలు కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ఈ రోజు బళ్లారిలో దర్యాప్తు చేపట్టారు. గాలికి అకౌంట్‌ ఉన్న పార్వతీనగర్‌ యాక్సిస్‌  బ్యాంకులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గాలి సోమశేఖరరెడ్డి, ఆయన అనుచరుల ఖాతాలను వారు…

బస్సు చెట్టుకు ఢీకొని 25 మందికి తీవ్ర గయాలు

ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని టామాటా గ్రామం వద్ద ఉట్నూరు డిపోకు చెందిన బస్సు మామిడిచెట్టుకు ఢికొంది. దీంతో 25 మందికి తీవ్రగాయాలుకాగా   10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ బస్సు ఆదిలాబాద్‌కు వెళుతుండగా   బస్సుడ్రైవర్‌ శ్రీనివాస్‌ సెల్‌లో మాట్లాడుతూ చూడకపోవటంతో ఈ…