Tuesday, 10 November 2026

వార్తలు

కాసేపట్లో ముఖ్యమంత్రితో భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌: సచివాలయంలో ఈ రోజు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌ తదితర విషయాలపై చర్చించినారు. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

కోటి విలువ చేసే గంజాయి పట్టివేత

విశాఖపట్నం: రోజు రోజుకు దేశవ్యాప్తంగా గంజాయి డ్రగ్స్‌కి ఎందరో యువకులు బానిసలయి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నంలోని జీకే విధిలో పోలీసులు సుమారు కోటికి పైగా విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధినం చేసుకున్నారు.

నేడు సోనియాను కలవనున్న ఈశాన్యరాష్ట్రాల లోక్‌సభ సభ్యులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రల్లో అభద్రతభావం పెరుగిపోతున్న సంధర్భంలో ఈశాన్య రాష్ట్రల్లోని ఎంపీలతో యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధిని కలసి వారి మనోభావాలను ఈ రోజు వివరించనున్నారు. వదంతులను నమ్మవద్దని అస్సోం సీఎంతో పాటు కేంద్ర హోంమంత్రి ప్రకటనలు…

ఈ నెల 21న రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నీక

ఢిల్లీ: రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఈ నెల 21న ఎన్నిక జరగనుంది నామినేషన్‌ గడువు రేపటితో ముగియనుంది. ఉప రాష్ట్రపతిగా నూతనంగా తిరిగి హామీద్‌అన్సారి ఎన్నికైన విషయం విధితమే.

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌:  జిల్లాలోని గూడురులో రైతులు ఎరువుల కోసం బారులో తీరారు. అక్కడ రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని వారించారు. భారీ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ అధికారులు చేస్తున్నారు.

90 పడకల్లో 206 మంది చిన్నారులకు చికిత్స: అరుణ

తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపల్లల ఆస్పత్రిలె 90 పడకల్లో 206 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి గల్లా అరుణ తెలియజేశారు. ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని, మౌలిక సదుపాయాలు సరిగా ఆమె చెప్పారు. ఆస్పత్రిలో సమస్యలను వెంటనే…

లంచం తీసుకుంటూ ఏసీబీకి వలలో చిక్కిన అగ్ని మాపక అధికారి

పశ్చిమగోదావరి: జిల్లాలోని అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్‌ ఓ పాఠశాలకు అనుమతి ఇవ్వటానికి రూపాయాలు 7500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

సీపీఐ ఆధ్వర్యంలో 25న తెలంగాణ పోరు యాత్ర

హైదరాబాద్‌: సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 25న తెలంగాణ పోరు యాత్ర నిర్వహించాలని ఆ పార్టి నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మగ్థూం భవన్‌లో ఇవాళ తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు, సీపీఐ నేతలు సమావేశమై చర్చించారు.…

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అనంతపురం: అనంతపురంలో  అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 3.25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

విద్యుత్‌ కోతల విషయంలో అధికారులను తప్పు పట్టదు:పీసీసీ చీఫ్‌

విజయనగరం: విద్యుత్‌ కోతల విషయంలో ట్రాన్స్‌కో అధికారులను తప్పుపట్టవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. విద్యుత్‌ కోతల విషయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొవాలని కోరారు. నిర్వహణా…