Monday, 9 November 2026

వార్తలు

ఉన్నత ప్రతిభ కోసం విద్యార్థులు కృషి చేయాలి:కపిల్‌సిబాల్‌

హైదరాబాద్‌: విద్యార్థులు ఉన్నత ప్రతిభకోసం కృషి చేయాలని కపిల్‌ సిబాల్‌ అన్నారు. బాట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ముఖ్య అతిధిగా కపిల్‌సిబాల్‌ హాజకయ్యారు. విద్యార్థులు నేర్చుకున్న విద్యాను సమాజ శ్రేయస్సుకోసం…

ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద భాధితులకు తక్షణ సహయం అందించాలని సీఎం ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బాధితలకు తక్షణ సహాయం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగివద్ద, గుంటూరు జిల్లా రాజుపాలెం వద్ద జరిగిన…

వృత్తి విద్యా కళాశాలలపై నియంత్రణ సరికాదు

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలలపై  నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ను వ్యతిరేకిస్తున్నామని కళాశాలల   యాజమాన్యాల సంఘం ప్రతినిధి కె.వి.కె. రావు పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగే తుది దశ చర్చల్లో బోధనా రుసుంపెంపుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు …

కాలేజీ యాజమాన్యాలతో మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: కళాశాల యాజమాన్యాలతో మరికాసేపట్లో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. బోధనా రుసుము. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలపై  ఈ సమావేశానంతరం ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ప్రైవేటు బస్సులో బోల్తా.. 40 మందికి గాయాలు

హిందూపురం: అనంతపురంలో జిల్లా హిందూపురం నుంచి వెంకటపురం గ్రామానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో…

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని అంబార్‌పేటలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 90 వేల రూపాయల నకీలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

భార్యను గొంతుకోసి చంపిన భర్త

హనుమాన్‌ జంక్షన్‌: వివాహేతర సంబధాన్ని నిలదీసినందుకు ఓభర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసించే సురేష్‌బాబుకు బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన గౌరినేని…

బాంబు కాల్‌తో విజయవాడ బస్టాండులో విస్తృత తనిఖీలు

విజయవాడ: నెహ్రు ఆర్టీసీ బస్టాండులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడి ఫోన్‌ కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్‌స్క్వాడ్‌తో రంగంలోకి దిగి బస్గాండ్‌లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

ఆసుపత్రిలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

విశాఖ: విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఇందోళనకు దిగారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నాట్లు ఆరోపించారు.

నేడు టీడీపీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశం కానున్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.