భార్యను గొంతుకోసి చంపిన భర్త
హనుమాన్ జంక్షన్: వివాహేతర సంబధాన్ని నిలదీసినందుకు ఓభర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసించే సురేష్‌బాబుకు బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన గౌరినేని లక్ష్మీ కుమారి (31)తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య తరచు గొడవ జరిగేది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణ పెరగటంతో భర్త .. భార్యను కత్తితో గొంతుకోసి దారుణంగా చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.