Monday, 9 November 2026

వార్తలు

రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పేపరు లీకైయిందని రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. మొదటి పరిక్షలో వి.కృష్ణ అనే అభ్యర్థి ప్రశ్నపత్రం తీసుకున్న తర్వాత బయటకు వెళ్లి 150మార్కుల జవాబులను ఓ తెల్లకాగితంపై రాసుకొచ్చాడని, కాలేజీ యాజమాణ్యం…

హస్తినలో గవర్నర్‌ బీజి బీజి పలువురు నేతలతో భేటీ

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ ప్రమాణస్వీకారానికి హాజరైన గవర్నర్‌ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అయినారు. చిదంబరం, జైపాల్‌రెడ్డి, గులాంనబీతో విడివిడిగా ఆయన సమావేశమయినారు. పాలనపరమైన అంశాలతోపాటు. రాజకీయా అంశాలు చర్చకువచ్చినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనంతరం రాష్ట్రంలో…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏబీవీపీ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఆందోళన చేపటంది. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా తార్నాక వైపు వెళ్తుండగా ఓయు పోలీసు…

లోయలో పడిన బస్సు :52కి చేరిన మృతుల సంఖ్య

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ ప్రదేశం రాష్ట్రంలోని చంబా సమీపంలో ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 52కి చేరింది. చంబానుంచి మణిమహేష్‌ వెళ్తుండగా బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.

ముంబయిలో ఆసోం అల్లరలపై ర్యాలీలో హింసాత్మకం

ముంబాయి: అసోంలో ఘర్షనకు నిరసనగా ఆజాద్‌ మైదానంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకకు దారీ తీసింది. పలు వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తమైన వాతవారణం నెకొంది. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

క్రితం ముగింపు వద్దే ముగిసిన నిఫ్టీ

ముంబయి: అమ్మకాలు, కొనుగోళ్లు కూడా ఎక్కువగా లేకపోవడంతో మార్కెట్‌ క్రితం ముగింపు వద్దే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మూడు పాయింట్ల నష్టంతో 17557.74 వద్ద ముగియగా, నిఫ్టీ రెండు పాయింట్ల నష్టంతో 5320.40 వద్ద ముగిసింది.

వారిద్దరి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్దం లేదు: పొంగులేటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డికి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్ధం లేదని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శంకరపల్లి, నేదునూరు ప్రాజెక్టుల విషయంలో జెన్‌కోకు గ్యాస్‌ లింకేజీ ఇస్తేనే నిర్మాణం వేగవంతమవుతుందన్నిది ప్రభుత్వ…

జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి కల్వకుర్తి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ…

పాల్వంచ కేటాపీఎస్‌-7లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్‌ -7 యూనిట్‌లో సాంకేతికలోపంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

పరీక్షకేంద్రం పేరు తప్పుగా ముద్రించడంతో గ్రూప్‌4 పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన 40మంది

హైదరాబాద్‌: బోడుప్పల్‌: గ్రూప్‌-4 అభ్యర్థులకు పరీక్ష కేంద్రం పేరును అధికారులు తప్పుగా ఇచ్చారు. ఉప్పల్‌ డిపో దగ్గర ఫిర్జాది గూడా లోని శ్రీ చైతన్య మహిళా కళాశాల చిరునామా ఇవ్వాల్సిన అధికారులు ఘట్‌కేసర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల…