ఎస్పీవోలపై మావోయిస్టుల కాల్పులు
ఒడిశా: మల్కాన్‌గిరి జిల్లా పొడియాలో ఎస్పీవోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోల దాడిలో ఇద్దరు ఎస్పీవోలు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఒడిశా: మల్కాన్‌గిరి జిల్లా పొడియాలో ఎస్పీవోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోల దాడిలో ఇద్దరు ఎస్పీవోలు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో చివరిరోజు పోటీలకు భారీ ఈదురుగాలులు ఆటంకం కలిగించాయి. 20నాటికల్ మైళ్ల వేగంతో వీసిన గాలులకు దాదాపు 20పడవలు బోల్తాపడ్డాయి. వీటిని యుధాస్థితికి తెచ్చేందుకు సెయిలర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. హైదరాబాద్…
కరీంనగర్: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి గాయాలు కాలేదని సమాచారం.
శ్రీకాకుళం: హౌసింగ్ శాఖపై పూర్తిగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు రావాల్సిన రుణాలపై కూడా జిల్లాలో పలు సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.…
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 30న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు నేతలతో ఆయన భేటీ అవుతారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆదివారం గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అటవీ భూములు గిరిజనులు ఆక్రమించుకుంటున్నారని అటవీ సిబ్బంది మర్లగూడెంలో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గిరిజనుల,…
హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్లో ఆదివారం జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో పలువురు సినీప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, రవికిశోర్ ప్యానళ్ల మధ్య జరిగిన ఈ ఎన్నికల సమయంలో రెండు వర్గాల…
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదని ఆ ప్రాంత ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యోగుల కిరణం’ మాసపత్రిక …
లండన్: లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పరాజం ఎదురైంది. మహిళల ఆర్చరీ టీం ఈవెంట్లో భారత్ ఓటమి పాలయ్యింది. డెన్మార్క్ చేతిలో 210-211 తేడాతో భారత్ ఓడిపోయింది.
హైదరాబాద్: కాలుష్యం నుంచి హుస్సేస్సాగర్ను పరిరక్షించుకోవాలని హైదరాబాద్‌లో భరీ వాక్ నిర్వహించారు. ఇండియాన్ ఆర్మీ, 92.7 బిగ్ ఎఫ్. ఎమ్.ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో కొనసాగిన ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు, మిలటరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని…