Sunday, 8 November 2026

వార్తలు

డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తియింది. మొత్తం 4,23,085 దరఖాస్తుల  వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ కోసం 65,004, స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ లాంగ్వేజ్‌ కోసం 2,69,096, లాంగ్వేజ్‌ పండిట్‌ కోసం  36,065, ఎస్జీటీ…

న్యూజిలాండ్‌లో భూకంపం

వెల్లింగ్‌టస్‌ : న్యూజిలాండ్‌ తూర్పుకోస్తా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదయింది. అయితే భూకంప ప్రభావంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారమందలేదు.2011 క్రైస్ట్‌చర్చిలో ఏర్పడిన భూకంపంలో 185 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం…

పదోపతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షల్లో 53.84 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయాల్సివుండగా ఆయన గైర్హాజర్‌ కావడంతో అధికారులే ఫలితాలను విడుదల చేశారు.

గ్రూఫ్‌-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌ : గ్రూఫ్‌-2 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో గ్రూఫ్‌-2 పరీక్ష ప్రారంభం కానుంది. మొత్తం 781 పోస్టులకు గాను 5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1360 పరీక్షా కేంద్రాలను ఊర్పాటు చేశారు.…

కూలిన పాఠశాల భవనం :తప్పిన ఘోర ప్రమాదం

మెదక్‌ : మెదక్‌ జిల్లా మనూర్‌ ప్రభుత్వ పాటశాల భవనం కూలింది. ఈ సమాయంలో విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో ఉపాధ్యాయులు గ్రామస్థులు ఊపిరి పిల్చుకున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న…

ఇంకా విడుదల కాని పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. మంత్రి పార్థసారిధి ఫలితాలను విడుదల చేయాల్సివుంది. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీంతో ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది.

నల్గొండలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

నల్గొండ: నల్గొండ జిల్లాలో మూసీ నదికి భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో నది ప్రవాహం పెరిగి వంతెనల పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో పోచంపల్లి, భువనగిరి మధ్యరాకపోకలకు అంతరాయం కలిగింది.

మణికొండ అపార్ట్‌మెంట్లలో వరదనీరు

మణికొండ: హైదరాబాద్‌ నగరంలో కురిసిన భారీ వర్షానికి మణికొండ, పుష్పాలగూడల్లోని పలు అపార్ట్‌మెంట్లలో వరదనీరు చేరింది. సెల్లార్లలో పార్క్‌ చేసిన వాహనాలు నీటిలో మునిగాయి. ఈ ప్రాంతాన్ని అనుకొని బుల్కాపూర్‌ నాలా ప్రవహిస్తోంది. అయితే నాలాప్రాంతం కబ్జాకు గురికావడంతో…

హైదరాబాద్‌లో 11.4సెంమీ.వర్షపాతం

హైదరాబాద్‌: రాష్ట్రరాజధానిలో 11.4శాతం వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈనెల 23వరకు తెలంగాణ, కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. 25న వాయువ్య బంగాళాఖాతంలో…

గాలి బెయిల్‌ కేసులో మరో నిందితుడు అరెస్టు

తిరుపతి: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారినికి సంబంధించిన మరో నిందితుడ్ని ఏసీబీ అరెస్టు చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి సమీప బంధువు అయిన దశరధరామిరెడ్డిఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధరణకు రావడంతో శుక్రవారం రాత్రి తిరుపతిలో అతన్ని…