Friday, 6 November 2026

వార్తలు

అధికారులతో మంత్రుల సమీక్ష

వరంగల్‌: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై  అధికారులతో చర్చించారు. ఈ కార్యామ్రమానికి కలెక్టర్‌ రాహుల్‌బొజ్జ, జేసీ తదితరులు హాజరయ్యారు.

జగన్‌ను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ఎస్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం విచారించనున్నరు.పీఎంఎల్‌ చట్టం కింద జగన్‌ను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఈడీ అధికారులు సీబఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు…

అగ్ని-1క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌: 700 కి.మీ పరిధీలోని లక్ష్యాలను చేధించే అగ్ని-1క్షిపణి ప్రయోగాన్ని బడిశాలో వీలర్‌ దీవిలోని ఇంటిగ్రేటెడ్‌ టెన్ట్‌ రేంజి నుంచి విజయవంతంగా పరీక్షించారు.1000కిలోల పేలుడు పధార్థాలను మోసుకెళ్లే ఈ క్షిపణఙ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు.

పారిశ్రామిక సంఘాలతో నేడు సీపీడీసీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: పారిశ్రమిక రంగానికి విద్యుత్‌ కోతలను  అధిగమించే విషయమై విద్యుత్‌ పంపిణీ సంస్థ సీపీడీసీఎల్‌ నేడు పారిశ్రామిక సంఘాలతో కానుంది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాకాలంలో  ఎక్కువ విద్యుత్‌ కోతలు విధంచడంపై పారిశ్రామిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో…

నేటి నుంచి ఏఐఈఈఈ మూడోరౌండ్‌ ప్రవేశాల నివేదన

వరంగల్‌:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్‌ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు పొందారు.మూడోరౌండ్‌లో సీటు లభించిన వారి జాబితాను సీసీబీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.వీరు…

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలి

హైదరాబాద్‌:రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలని తెరాస రాజకీయ ఐకాస బహిరంగ లేఖ రాసింది.ఈమేరకు ఎంపీలకు,ఎంఎల్‌ఏలకు వాటిని పంపింది.తెలంగాణ విషయంలో ఇచ్చిన ఎన్నికల హమీని కాంగ్రెస్‌ నిలబెట్టు కోవాలని ఆ లేఖలో ఐకాస ఛైర్మన్‌ కోదండరాం కోరారు.

జర్దారీపై కేసులను తిరిగి విచారించాలి:సుప్రీం

పాకిస్థాన్‌   మాజీ ప్రధాని జరారీపై ఉన్న అవినీతి కేసులను తిరిగి విచారించాలని ఆదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.జర్ధారీ కేసు విషయంలో స్విస్‌ అదికారులను సంప్రదించాలని ప్రభుత్వానికి సూచించింది.

చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ బృందం

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్ట్తన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఫెమా, మనీల్యాండరింగ్‌ చట్టాల కింద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో…

వసతి గృహలకు తక్షణమే నిధుల విడుదల

హైదరాబాద్‌:దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆశ్రమ వళాశాలలు,పాఠశాలలు,వసతి గృహలకు తక్షణమే నిదులు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,బాలరాజు అధికారులను ఆదేశించారు.భద్రాచలం ఆశ్రమ కళాశాల,పాఠశాలలకు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆ జిల్లా కలక్టరును ఆదేశించారు.

ఖరీఫ్‌లో వరి నాటవద్దు

బోధన్‌ గ్రామీణం:ఖరీఫ్‌లో వరి నాటవద్దని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి రైతులకు సూచించారు.బోధన్‌ మండలం పెంటాకుర్దు గ్రామంలో పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో  ఆయన మాట్లాడతూ వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరులేదని,దీంతో విద్యుత్తు…