Thursday, 5 November 2026

వార్తలు

దళితులపై దాడి ఘటనలో 54 మంది అరెస్టు

శ్రీకాకుళం: లక్ష్మీపేట దళితులపై దాడి ఘటనలో 65మంది నిందితుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్‌ డీజీ గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి బొత్స వాసుదేవనాయుడు, ఆవుల శ్రీనివాస్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించామన్నారు. ప్రధాన…

వేలంపాటలో రూ.6.57 కోట్లు రాబట్టిన కళాఖండాలు

ముంబయి:దక్షిణ భారతదేశం ఇతివృత్తంగా రూపొందించిన కళాఖండాలు గోవా,చోలమండళం, ఇటీవల నిర్వహించిన ఒక వేలంపాటలో రూ.6.57 కోట్ల మొతాన్ని రాబట్టాయి.వీటిలో ఎఫ్‌.ఎన్‌.సౌజా అనే చిత్రకారుడు గీసిన చిత్రం అత్యదికంగా రూ.60 లక్షలకు అమ్ముడుపోయింది.దాని తర్వాత రూ.48 లక్షలతో కె.రామానుజం చిత్రం…

బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: బీసీ వెల్ఫేర్‌ వెబ్‌సైట్‌ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వెనకబడిన తరగతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులను అవసరమైతే పెంచుతామన్నారు. వెనుకబడిన అన్ని కులాలను కలిసి స్టడీ సర్కిల్స్‌ను జిల్లాల…

శ్రీశైలం అడవుల్లో హైదారాబాద్‌ యువతి మృతదేహం

హైదరాబాద్‌:సైదాబాద్‌కు చెందిన యాదమ్మ అనే 16 సంవత్సరా యువతి దారుణహత్యకు గురైంది.ఈమె మృతదేహం శ్రీశైలం అడవుల్లో ఈరోజు లభ్యమైంది.యువతి అదృశ్యం పై మూడు రోజుల క్రితం మాదన్నపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.స్నేహితులే యాదమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు…

పాలగడ్డ అటవీ ప్రాంతంలో భారీ డంవ్‌ స్వాధీనం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా వై. రామవరం మండలం పాలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌ను తీవ్రవాద వ్యతిరేక దళం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న డంవ్‌ను కాకినాడ తరలించారు.

ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా బి. ఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఎడ్‌సెట్‌ 2012 ఫలితాలు  ఈ రోజు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌ ఎం.జి.గోపాల్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.

గవర్నర్‌ నరసింహన్‌ సోనియాతో భేటీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నరసింహన్‌ అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర నాయకత్వం తదితర అంశాలపై చర్చించే…

సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు

ఢిల్లీ: సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. ఈరోజు సోనియాతో నరసింహన్‌ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు. మరికాసేపట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో నరసింహన్‌…

నిందితులను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితులను విచారించేందుకు ఈడీ అధికారులు ఈరోజు ఉదయం చంచల్‌గూడ్‌ జైలుకు చేరుకున్నారు. ఎమ్మార్‌ నిందితులు కోనేరు ప్రసాద్‌, బీపీ ఆచార్య, సునీల్‌రెడ్డి, విజయరాఘవలను ఈడీ బృందం ప్రశ్నించనుంది.

కిరణ్‌, బొత్సలతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణతో ఈరోజు ఉదయం పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు…