Thursday, 5 November 2026

వార్తలు

హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ

హైదరాబాద్‌:  సీబీఐ అదనపు డైరెక్టర్‌ గుప్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. జగన్‌ అక్రమాస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు, ఎమ్మార్‌ అక్రమాల కేసుల పురోగతిని సమీక్షించేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చినట్లు  తాజా సమాచారం అందింది.

తెలుగెదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు నరసన్నపేట నియోజవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సాగుతున్న ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు.

భారత్‌-చైనా ఒప్పందం

బ్రెజిల్‌: రక్షణరంగంలో 2015లోగ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేలా భారత్‌-చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్రెజిల్‌లో జరుగుతున్న రియో డిజెనెరీ సదస్సులో  ఇరు దేశాల ప్రధానమంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు.

కేటీపీఎస్‌లో ప్రమాదం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం కేటీపీఎస్‌ పాతకర్మాగారంలోని  ‘ఎ’ స్టేషన్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై బొగ్గు పెళ్లలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ…

టెలిఫోన్‌ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌: దర్పల్లిలోని టెలిఫోన్‌ ఎక్జేంజ్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద:  నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌ సమీపంలో ఓ హోటల్‌లో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్‌లోని ఫర్నిచర్‌ అంతా  పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను  చల్లరగోటారు.…

చిరంజీవికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

చైనై: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ చిరంజీవికి తమిళనాడు హూసూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అక్టోబర్‌ 2 లోగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు…

పోలీసు శాఖ లో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు

హైదారాబాద్‌ : పోలీసు శాఖలో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు తీసు కుంటున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు.ఓక్కోస్థాయి పోస్టుకు ఓక్కోలెక్క న వస్తున్నారన్న ఆయన పదేళ్లుగా పోలీసుశాఖ బదిలీలు,పదోన్నతులపై సమాచార హక్కుచట్టం కింద వివరాలు అడిగినట్లు తెలిపారు.ఆ…

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

తులసిరిడ్డి సంగారెడ్డి: తెలంగాణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందని 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని వెల్లడించిన వెంటనే కేంద్రం సరైన సమయంలో సరైన నర్ణయం తీసుకొంటుందని మెదక్‌ జిల్లా…

తెలంగాణ ఫోరం నేతల భేటీ

హైదరాబాద్‌: టీడీఎల్పీ కార్యాలయంలో ఈ రోజు తెదేపా తెలంగాణ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.