Wednesday, 4 November 2026

వార్తలు

కొత్త ఎక్సైజ్‌ పాలసీ విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ విధానం అమలు కానున్నది. కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ నూతన ఎక్సైజ్‌ విధానం మేరకు 10వేల జనాభా గల ప్రాంతంలో ఎక్సైజ్‌ ఫీజు 32…

ఓటమికి అందరూ బాధ్యులే : ఎంపీ ప్రభాకర్‌

హైదరాబాద్‌ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలతోపాటు ఒక పార్లమెంట్‌…

తెలంగాణ శక్తులతో కలిసేందుకు సిద్ధం : కోమటి రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రభుత్వం లేదని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,…

రంగారావు క్షమాభిక్ష అభ్యర్థనకు కోర్టు అంగీకారం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో తనను క్షమించాలన్న తుమ్మల రంగారావు అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. మెజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని రంగారావుకు కోర్టు షరతు విధించింది.ఆయనను అపరాధసాక్షిగా పరిగణిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.…

సీఎం ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కలిశారు. ఈసందర్భంగా సీఎంతో సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నిలిపివేత

ఉమేష్‌కుమార్‌ హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల  25వ తేదీలోపు దిగువ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రపతిగా పోటీచేసేందుకు కలాం నిరాకరణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్‌ కలాం నిరాకరించారు.తృణమూల్‌ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా  ప్రకటన చేశారు. మమతాబెనర్జీకి తనపట్ల  నమ్మకం ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.పోటీచేసేందుకు…

ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 కి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన భిక్షపతి

హైదరాబాద్‌ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర పెట్టుబడి దారులకు బుద్ధి చెప్పిన పరకాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.…

ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.