Sunday, 15 November 2026

హైదరాబాద్

పరిశ్రమలు ఆశిస్తున్న నైపుణ్యాలను విద్యార్థులు తెలుసుకోవాలి

హైదరాబాద్‌: పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయో విద్యార్థులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రాజీవ్‌ యువకిరణాల పథకంపై ఈ రోజు జరుగుతున్న సదస్సును జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉద్యోగాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలదేనని ఆయన…

బెరైటీన్‌ గనుల వద్ద బాధితుల ధర్నా

కడప: కడప జిల్లా మంగంపేటలో అగ్రహారం గ్రామస్థులు బెరైటీస్‌ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. బెరైటీస్‌ గనుల వద్ద బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రహారం డేంజర్‌ జోన్‌ పరిధిలో ఉన్నా పరిహారం ఇవ్వలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్సు ఎక్కుతూ పడిపోయి బీటెక్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఉమర్‌ అనే బీటెక్‌ విద్యార్థి మృతిచెందాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా అని తెలిసింది.

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

విజయవాడ: సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌ 9వ నెంబరు ప్లాట్‌ఫాంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రజలు దీన్ని సందర్శించవచ్చు. ఈరోజునుంచి 6వ తేదీవరకు దీన్ని ఇక్కడే…

33కు చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 33కి పెరిగింది. చెన్నైలో చికిత్స పొందుతున్న సాంబశింరావు ఈరోజు మృతిచెందారు. ఆయన కృష్ణా జిల్లా పెదపారువూడి మండలం దువ్వనపూడి వాసి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రైల్వే సేఫ్టీ…

ఆర్‌ఎస్‌ఎన్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ అదృశ్యం

కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎన్‌ మాజీ చీఫ్‌ కె. సుదర్శన్‌  కనిపించడం లేదు. ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిని ఆయన ఆ తర్వాత కన్పించకుండా పోయినట్లు సమాచారం. సుదర్శిన్‌ అదృశ్యంపై మైసూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

రైలులో జవాను ఘాతుకం

విజయవాడ: అలెప్పీనుంచి బొకారో వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో గత అర్థరాత్రి 12 గంటల సమయంలో మిలిటరీకి చెందిన ఓ జవాను బోగీలోని ఓ బాలికపట్ల అస్యభ్యంగా ప్రవర్తించాడు. సహా ప్రయాణీకులు టీసీకి సమాచారం అందించటంతో బోగీలో ఉన్న  భద్రతాసిబ్బంది జవానును…

క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజేందర్‌ సింగ్‌

లండన్‌: ఒలంపిక్‌ క్రీడల్లో పురుషుల మిడిల్‌వైయిట్‌ (75కేజీ) బాక్సింగ్‌ విభాగంలో ఇండియన్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు టెరెల్‌గౌషాతో జరిగిన మ్యాచ్‌లో 16-15తేడాతో విజయం సాధించాడు.

హెర్గ్యూన్‌ యూనివర్శిటీలో ఆడిటర్ల తనిఖీ

అమెరికా: అమెరికాలోని సన్నీవేల్‌లో గల హెర్గ్యూస్‌ యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు, పనితీరుపై ఆడిటర్లు తనిఖీలు నిర్వహించారు. వీసాల అవకతవకల పై వర్సిటీ ఉన్నతాధికారి జెర్రీవ్యాంగ్‌ను ఆరెస్టు చేశారు. విద్యార్థుల భవిష్యత్‌పై అమొరికా ప్రభుత్వం రేపు అధికారికంగా ప్రకటన వెలువరించనుంది.…

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19 సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అధికారులు సమస్యను…