Sunday, 15 November 2026

హైదరాబాద్

హర్యానాలో రోడ్డుప్రమాదం: 10మంది మృతి

హర్యానా: హర్యానాలోని లాడ్వా జిల్లా బంగన్‌లో బస్సు, వ్యాన్‌ ఢీ కొన్న ప్రమాదంలో పది మంది మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. రాజస్థాన్‌ నుంచి లాడ్వాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మార్‌ కేసులో మరో 43కీలక పత్రాలు సేకరించాం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో మరో 43 కీలక పత్రాలు సేకరించినట్లు కోనేరు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల్లో సీబీఐ పేర్కొంది. ఈకేసులో మరో 8మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని సీబీఐ పేర్కొంది. విల్లాల అమ్మకాలతో అర్జించిన సొమ్మును సౌత్‌ఎండ్‌…

బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మోపిదేవి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఈరోజు సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

నీలిమ పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్‌: మంగళవారం రాత్రి మరణించిన సాఫ్‌టవేర్‌ ఉద్యోగిని నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. వారంలోగా నివేధిక ఇస్తామని వైద్యులు తెలిపారు. నెలరోజుల్లో విస్రా నివేదిక వస్తుందని అందులో పూర్తి వివరాలు తెలుస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతున్నారు: అన్నాహజారే

న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే ప్రజు తమ నుంచి రాకీయ ప్రత్యామ్నాయం ఆశిస్తున్నారని అన్నా హజారే అన్నారు. ఈ రోజుతో అన్నా దీక్ష అయిదవరోజుకు చేరింది. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయపార్టీ పెట్టడంలో…

ఆటో కారు ఢీ ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

కంచిచర్ల : మధిర రోడ్డులో కంచికర్ల ఆయిల్‌ బంక్‌ సమీపంలో ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు నరసింహరవు పాలెంకు చెందిన వారు.

పేదలను విస్మరించడం తగదు

ఖమ్మం, ఆగస్టు 2: పేదలను విస్మరించిన ప్రభుత్వాలు కుప్పకూలి కనుమరుగు కావడం ఖాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు. పాల్వంచలో 15 మందికి పైగా ప్రజలకు ఇళ్ల…

రేపు దీక్ష విరమించనున్న అన్నా హజారే

. ఢిల్లీ : అవినీతిని అంతం చేయాడానికి నడుం కట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజరే జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం ఆయన గత అయిదు రోజులుగా ఢిల్లీలో ధీక్ష చేస్తున్న విషయం దిదితమే. అయితే ఆయన ఆరోగ్య…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. తెలుగు మహిళలు, విద్యార్థులు చంద్రబాబుకు రాఖీ కట్టారు. 666అడుగులతో ఏర్పాటు చేసిన భారీ రాఖీ ఆకర్షనగా నిలిచింది

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.