Sunday, 15 November 2026

హైదరాబాద్

తివారీ డీఎస్‌ఏ నివేదిక వెల్లడి

ఢిల్లీ: పితృత్వం కేసులో ఎన్డీ తివారీ డీఎస్‌ఏ నివేదికను ఢిల్లీ హైకోర్లు బహిర్గతం చేసింది. రోహిత్‌ శేఖర్‌ తండ్రి తివారీయే అని నిర్థారణ కావడం సంతోషంగా ఉందని రోహిత్‌ శేఖర్‌ అన్నారు. ఎన్డీ తివారీ తన తండ్రి అని…

ఎన్‌ఐఆర్‌డీలో జిల్లా కలెక్టర్లతో భేటీ

హైదరాబాద్‌: నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో యువత ఉద్యమాల పట్ల ఆకర్షతులు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ గ్రామీణాభివృద్ధి మండలి (ఎస్‌ఐఆర్‌డి) కార్యాలయంలో రెండురోజుల సెమినార్‌ ప్రారంభమైంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ…

ఉపాధిలో మరో 50 రోజల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50 రోజుల పని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తొలి శుక్రవారం ప్రశాంతంగా రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక వచ్చిన తొలి శుక్రవారం నేడే కావడంతో మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లిం సోదరులు  అధిక సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు…

ఆరుగురు విద్యార్థులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనూరులో మీనాక్షి శిశుమందిర్‌ పాఠాశాలపై కస్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు…

అర్హులైన వారందరికీ వీసాలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం:అమెరికన్‌ కాన్సూలేట్‌ జనరల్‌

గుంటూరు:గుంటూరు వైద్య కళాశాలలో వీసాల జారీపై అవగాహన సదస్సును నిర్వహించింది. వీసా దరఖాస్తులు పూర్తిచేసే సమయంలో కచ్చితమైన సమాచారం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అమెరికన్‌ కాన్సూలేట్‌ జనరల్‌ వైస్‌ కూన్సిల్‌ జెరిమి జువిట్‌ అన్నారు. అమెరిక చట్ట…

‘టీ’ ఎంపీలతో కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం కలవనుంది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రి…

బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌పై సీబీఐ కౌంటరు దాఖలు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ కౌంటరు దాఖలుచేసింది. బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదన్న సీబీఐ కౌంటర్‌పై విచారణను న్యాయస్థానం ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా  వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరింది.

హైదరాబాద్‌: హక్కులను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైన  రాష్ట్ర ప్రభుత్వం అచేతన స్థితికి చేరిందని వామపక్షాలు విమర్శించాయి. ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు జైలు శిక్ష పడ్డ మంత్రి రాజీనామా చేయకుండా ఉంటే బర్తరఫ్‌ చేయకుండా ముఖ్యమంత్రి ఏం  చేస్తున్నారని సీపీఎం,…

ఫీజుల పెంపు కేసు విచారణ వాయిదా

ఢిల్లీ: వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగష్టు ఒకటికి వాయిదా వేసింది. వృత్తి, విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గడువు కోరిన నేపధ్యంలో ఈ కేసు…