మంచిర్యాల జిల్లాలోని చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు డివిజన్ పరిధిలోకి చెన్నూరు, జైపూర్, భీమారం, కొత్తపల్లి, మందమర్రి, అస్నాద్, పారుపల్లి మండలాలతో డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీంతోపాటు ప్రస్తుతం చెన్నూరు మండలంలో ఉన్న అస్నాద్‌ను కొత్త మండల కేంద్రంగా, 11 గ్రామాలతో మండలాన్ని, కొత్తపల్లి మండలంలో కొనసాగుతున్న పారుపల్లి కేంద్రంగా 19 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ హర్షం వ్యక్తం చేసారు. సిఎం కేసీఅర్,మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతగ్నతలు తెలిపారు.
నెరవేరనున్న చెన్నూరు ప్రజల కల




