సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ : కేటిఆర్

సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ : కేటిఆర్


CM KCR has viral fever: KTR

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గు సమస్యతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సదరు విషయాన్ని పోస్ట్ చేశారు. స్వగృహంలోనే ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, కొన్ని రోజుల్లోనే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. ఈ విషయమై ఎవరు ఆందోళన చెందవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.