నవంబర్ 9న సిఎం కేసీఆర్ నామినేషన్లు

CM KCR nominations on November 9హైదరాబాద్ : నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9న సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.