అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను అధినేత సిఎం కేసీఆర్ అందచేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్ వివరిస్తారు. సూచనలు ఇస్తారు.