జల్లి గ్రామంలో వంటల పోటీలు

చెన్నారావుపేట, ఏప్రిల్ 1 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వంటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జల్లి సర్పంచ్ యాట సుధాకర్, ఉప సర్పంచ్ మెరుగు బాబు, ఐసిడిఎస్ సిడిపిఓ మధురిమలు పాల్గొని జంటలతో వంటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని పలు జంటలతో వంటలను చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బోడ మోతిలాల్ శిరీష, కొర్ర మోహన్, పొలిశెట్టి చిట్టిబాబు, సూపర్వైజర్లు వాసంతి, రాద, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఈర్య, అంగన్వాడి టీచర్లు రమాదేవి, కృష్ణవేణి, రజిత, ఆయాలు సుజాత, లలిత, నందు, అనిల్, సురేష్, గర్భిణీ స్త్రీలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.