పాఠశాల పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి రూ.51వేల ఆర్థిక సహాయం

కృష్ణ,సెప్టెంబర్ 22 ( జనం సాక్షి): మండలం ఆలంపల్లి ప్రాథమిక పాఠశాలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కట్ల శరణప్ప సోమవారం అకాల మరణం చెందడంతో మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కృష్ణ మండల విద్యాధికారి నిజాముద్దీన్ సూచనల మేరకు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వంతు సహాయంగా విరాళాలను సేకరించారు.శరణప్ప కుటుంబ పరిస్థితులను, ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తు, విద్యాభ్యాసం ,కుటుంబ పోషణను దృష్టిలో ఉంచుకొని రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. అనంతరం వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడు తూ,శరణప్ప కుటుంబానికి అండగా నిలవడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, వారి పిల్లల భవిష్యత్తుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,ఎమ్మర్సి సిబ్బంది, సిఆర్పి లు, సర్పంచులు, గ్రామస్తులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని శరణప్ప కుటుంబానికి సానుభూతి తెలిపారు.