అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : వడియావత్ సువర్ణ దేవేందర్

బిఆర్ఎస్ పార్టీ 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

కల్వకుర్తి (జనంసాక్షి) : కల్వకుర్తి మున్సిపల్ 2 వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి వడియావత్ సువర్ణ దేవేందర్ కల్వకుర్తి మున్సిపల్ ఎలక్షన్ లో 2వ వార్డు కౌన్సిలర్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలను పట్టించుకోలేదని దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.  బిఆర్ఎస్ పార్టీ నుంచి నుంచి నిలబడుతున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని తెలిపారు. నాకు 2వ వార్డ్ కౌన్సిలర్ గా అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎడ్మ సత్యం రాధికా తదితరులు పాల్గొన్నారు.