పేద అమ్మాయి పెళ్లికి సహాయం
వరంగల్ ఈస్ట్, మార్చి 31 (జనం సాక్షి)వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిక్కులపల్లి సతీష్ సోదరి వద్దిరాజు సంధ్యా శ్రీధర్ కుమార్తె సాత్విక పెళ్లికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, కొండా వీరాభిమాని అయిన కోడం శివకృష్ణ మంగళవారం 50 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులు, సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మాయి ఎంతో సంతోషించి కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో కత్తెర శాల శ్రీధర్ , కే ఎస్ కే టీం సభ్యులైన కొమ్మరాజు, సందీప్ బొమ్మగాని, శ్రీనివాస్ తొగరు, చందు, దయాసింగ్, బాలచైతన్య, శివ తదితరులు పాల్గొన్నారు.


