అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త…..
ఆత్మకూర్, డిసెంబర్ 26 (జనం సాక్షి)అనుమానంతో భార్య గొంతు కోసిన సంఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మకూరు గ్రామానికి చెందిన మంద రవి అనూష దంపతుల మధ్య కొన్ని రోజుల నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలనే పెద్దమనుషుల సమక్షంలో వారి పంచాయతీ చేసుకొని ఇరువురు కలిసి ఉంటామని మాట్లాడుకున్నారు. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యపై అనుమానంతో భర్త శుక్రవారం నిద్రిస్తుండగా ఆమెపై కత్తితో వివిధ భాగాలపై కోస్తూ గొంతుపై కూడా కత్తితో కోశాడు ఆమె మేల్కొని కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు అనూష జిల్లాలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తుందని తెలిపారు. అనూష కి ఇద్దరూ కూతుర్లు ఇట్టి సంఘటనపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.



