ఇందిరమ్మ రాజ్యంలో దోపిడి రాజ్య మేలు తుంది: కేటీఆర్
హైదరాబాద్ (జనం సాక్షి)బీ ఆరు గాలం కష్టపడి చెమటోడ్చి రైతులు పండించిన రెక్కల కష్టం దర్జాగా దళారుల పాలవుతుందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం పై వి రుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఆఫీసులో కొనుగోలు కేంద్రం తప్ప రాష్ట్రంలో ఒక కొనుగోలు కేంద్రం పనిచేస్తా లేదని విమర్శించారు. రైతులను ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని, అందుకే వరికి ,పత్తికి దేనికి మద్దతు ధర లేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. రుణమాఫీ చేయలే, రైతుకు పెట్టుబడి సాయం ఇయ్యలే నేడు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులను అరి గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు.