హైదరాబాద్, (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) :
హిమాయత్ నగర్ ఈనాడు రిపోర్టర్ దత్తాత్రి గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన భౌతిక కాయానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నివాళులర్పించారు. మంగళవారం హిమాయత్ నగర్ లోని దత్తాత్రి ఇంటికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమయ్య దత్తాత్రి కుటుంబ సభ్యులకు ఓదార్చి దహనసంస్కారాల ఖర్చుల కోసం రూ. 5 వేలు సహాయం అందజేశారు. సోమయ్యతో పాటు పలువురు జర్నలిస్టులు ఆర్థిక సహాయం చేశారు. దాదాపు పాతికేళ్ళుగా జర్నలిస్టుగా పని చేస్తున్న దత్తాత్రి చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించడం అత్యంత బాధాకరమని పలువురు పాత్రికేయులు అన్నారు.
గుండె పోటుతో జర్నలిస్టు దత్తాత్రి మృతి




