నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేద్దాం

ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుండెమోని శేఖర్ ముదిరాజ్  

జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): నేడు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తులు, గణపతి మండపాల నిర్వాహకులు అందరూ కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని జడ్చర్ల ముదిరాజ్ సంఘం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుండెమోని శేఖర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ పట్టణంలో భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగే నిమజ్జన వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రను నిర్వహించి, గణనాథులకు వీడ్కోలు పలకాలన్నారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే గణనాథులకు, భక్తులకు ఘన స్వాగతం పలికేందుకు జడ్చర్ల సిగ్నల్ గడ్డ (పూలే-అంబేద్కర్ చౌరస్తా) వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులుగా పోలేమోని రవి ముదిరాజ్, కావలి మల్లేష్ ముదిరాజ్, బత్తుల నర్సింలు ముదిరాజ్, పద్మ కృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులుగా కోలి శాంతయ్య ముదిరాజ్, పండ్ల రాఘవేందర్ ముదిరాజ్, వర్ల విజయ్ కుమార్ ముదిరాజ్, శివ ముదిరాజ్ ఎన్నికయ్యారు.