NH-563 పై స్పీడ్ లేసర్ గన్ ఏర్పాటు:

తోర్రుర్ 17 ఆగస్టు (జనంసాక్షి)
ఖమ్మం -వరంగల్ జాతీయ రహదారి పై అతి వేగం వలన ప్రతిరోజు రోడ్ ప్రమాదాలు జరుగుతుండటం తో స్పీడ్ లేసర్ గన్ ద్వారా వాహన వేగం స్పీడ్ టెస్టింగ్ తో పాటు, నిర్లక్ష్యం గా అతి వేగం గా వెళ్లే వాహనాలకు స్పీడ్ లేసర్ గన్ ద్వారా చల్లాన్స్ విధించడం జరిగింది. మొత్తంగా 20 వాహనాలకు 20000 వేల రూపాయల జరిమాన విధించడం జరిగింది. తొర్రురు, దంతాలపల్లి, మరిపెడ పరిధి లో ని జాతీయ రహదారి పై స్పీడ్ లేసర్ గన్స్ పెట్టించడం జరిగింది కావున వాహనదారులు ఎవరు కూడా స్పీడ్ లిమిట్ దాటకుండా ప్రయాణించగలరు.మీ ప్రాణాలు మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో తొర్రురు సీఐసత్యనారాయణ, ఎసై సతీష్, పెద్దవంగర ఎసై రియాజ్ పాషా, దంతాలపల్లి ఎసై జగదీష్, నర్సిములుపేట ఎస్సై మంగిలాల్, నెల్లికుదురు ఎసై జితేందర్ పాల్గోన్నారు.