గురుకుల కళాశాలలోమెగా ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు
వరంగల్ ఈస్ట్, మార్చ్ 25 (జనం సాక్షి)టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి వరంగల్ ఈస్ట్ కాలేజీ నందు నిర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ వివిధ కంపెనీల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఇందులో హెచ్ఆర్హెచ్ నెక్స్ట్, స్నైడర్, మెడ్ ప్లస్, లెన్స్ కార్ట్, కార్స్ ఫ్ఫిన్న్ టెక్, హేటిరో, బి పి ఓ సి మొదలగు వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 79 మందివిద్యార్థినిలు ఉద్యోగాలకు ఎంపిక కాగా .కళాశాల ప్రిన్సిపల్ డా.రాధిక వైస్ ప్రిన్సిపల్ డా. సునితలు విద్యార్థులను అభినందిస్తూ కళాశాల ప్లేస్ మేంట్ విభాగం అధ్యాపకులైన ప్రతిభ మరియు హారతిలు విద్యార్థులపట్ల తీసుకుంతటున్న శ్రద్ధను కొనియాడారుఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ఇంటర్వ్యు అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందామనీ మంచి కంపెనీలలో ఎన్నికయ్యామని ఇందుకు సహకరించిన నిర్మాణ్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు విద్యార్థులను అధ్యాపకులందరూ అభినందించారు.


