నేడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు
బచ్చన్నపేట ఫిబ్రవరి 9( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో నేడు ఉదయం 𝟴గంటలకు ఉచిత కంటి పరీక్ష మెగా క్యాంపు నిర్వహిస్తున్నందున గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ
NRI సారధ్యంలో గణేష్ ఐ కేర్ హాస్పిటల్ బృందం ఉచిత కంటి పరీక్ష మెగా క్యాంప్ నిర్వహించి కంటి లోపాలు ఉన్నవారిని ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్ వారి నేత్రాలయం లో కంటి పరీక్ష (శుక్లాలు)నిర్వహించి,అవసరం ఉన్న వారిని గుర్తించి వెంటనే హైదరాబాద్ కు ఉచిత బస్సు సౌకర్యం, భోజన సదుపాయం కూడా కల్పించి తీసుకువెళ్లి,శస్త్రచికిత్స చేయించి మరుసటి రోజున ఉచిత రవాణా సదుపాయంతో తీసుకు రావడం జరుగుతుందని .కంటి ఆపరేషన్ కు వచ్చే వారు ఆధార్ కార్డు ,రేషన్ కార్డు జీరాక్సు ఫోన్ నంబరు తీసుకొని రాగలరు. గణేష్ ఐ కేర్ ఆప్టికల్స్ గుండేటి గణేష్ (DOA) కాకతీయ మెడికల్ కాలేజి, వరంగల్, సీనియర్ నేత్రవైద్య సహాయక నిపుణులు,రి.నెం.1308, ఎలక్టోరో కార్డియోగ్రాఫ్ (గాంధీ మెడికల్ కాలేజి) సికింద్రాబాద్.ఉచిత కంటి శుక్ల ఆపరేషన్లు క్యాంపు ఐబి సెంటర్ వద్ద కావున బచ్చన్నపేట గ్రామంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు



