‘అర్థరాత్రి ఎమ్మెల్యేల అరెస్ట్’
హైదరాబాద్ : అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయటం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్టాడుతూ ప్రజా సమస్యలపై ఎవరితో అయినా కలిపి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్ సమస్యపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.


