ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం: శ్రవన్‌కుమార్‌

చైతన్యపురి, జనంసాక్షి: ‘గడప గడపకు తెలంగాణ’ నినాదంతో మలిపోరు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నట్లు తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం చైతన్యపురిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన తెరాస సమావేశంలో ఈనెల 3 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు ఎల్‌బీనగర్‌ తెరాస ఇన్‌చార్జీ సత్యనారాయణ, పలు డివిజన్లకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.