టిఎస్పిఎస్సి చెర్మన్ ని తొలగించాలి.
టిఎస్పిఎస్సి చెర్మన్ ని తొలగించాలి.-ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో కురవి సెంటర్ లో నిరసకురవి మార్చి/28/జనం సాక్షి న్యూస్:టిఎస్పిఎస్సి పేపర్ లికేజీ వ్యవహరంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైర్మన్ ను వెంటనే అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పట్ల మధు డిమాండ్చేశారు.మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ కురవి మండల కమిటీ ఆద్వర్యంలో నిరసనకార్యక్రమంనిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. పేపర్ లికేజి ఐ ఇన్ని రోజులు గడిస్తున్న ఇప్పటి వరకు చెర్మెన్ తొలగించకపోవడం ఏంటని ప్రశ్నించారు.. పేపర్ లికేజీ భాద్యలను కఠింనంగా శిక్షించాలని అన్నారు…పబ్లిక్ సర్వీసు కమిషన్ ను ప్రక్షాళన చేయాలని అన్నారు. పేపర్ లికేజి పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సంవత్సరాల తరపడి కష్టపడిన నిరుద్యోగులకు ఆర్దిక సహయం అందిచాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కురవి మండల అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక వీరెందర్,నిమ్మిశెట్టి మురళి మండక నాయకులు వెంకటేష్,గణేష్,అనిల్,మహేష్,ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.