ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతల పయనం
హైదరాబాద్: సాగరహారం నేపథ్యంలో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒత్తిడి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. మంత్రి డీ కె. అరుణ మాట్లాడుతూ ఈ మధ్యాహ్నం మహబూబ్ నగర్ నేతలంతా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో కలుస్తామని తెలంగాణపై సత్వర నిర్ణయాన్ని తీసుకోవాలని కోరతాన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని జఠిలం ఆవిర్భావానికి ముందే మహబూబ్‌నగర్‌లో తెలంగాణవాదాన్ని వినిపించామన్నారు.



