నేడు ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ దీక్ష

హైదరాబాద్‌: డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను నిలుపుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ఆపార్టీ నేతలు దీక్షకు దిగనున్నారు. వారితోపాటు పలువురు తెలంగాణ జేఏసీ నేతలు, తెలంగాణ నగారా సంస్థ అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి దీక్షా శిబిరంలో  కూర్చుని నిరసన తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హాజనై విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.