బండి తనయుడు భగీరథ్‌పై పోక్సో కేసు!

` మైనార్ బాలికపై అత్యాచరం జరిపినట్లు ఫిర్యాదు
` రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
` సీఎం చేతిలో హోంఖాఖ ఉన్నా కనీసం సమీక్షలు లేవు
` చట్టం ఎవరికైనా ఒక్కటిగానే ఉండాలి
` ఘటనపై బీఆరఎస్ నేతల ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేధింపుల కారణంగా బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. చివరికి గత అర్ధరాత్రి ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, మొదట్లో బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటంతో పోలీస్ స్టేషన్ వద్ద సుమారు ఆరు గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు అనంతరం బండి సంజయ్ కొడుకు భగీరాథ్ మరోసారి సోషల్ విÖడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకుముందు కూడా కాలేజీలో ఒక విద్యార్థిపై దాడి చేసి భగీరథ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే భగీరథ్‌పై పాత వివాదాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్ ఇప్ప్పుడు మళ్ళీ వైరల్‌గా మారింది. భగీరథ్‌ను ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్‌తో పోలుస్తూ ఆర్జీవీ అప్పట్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ విÖడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
సిఎం చేతిలో హోం ఉన్నా సవిÖక్షలు లేవు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయంపై మాజీహోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. 17 సంవత్సరాల బాలికకు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేయించడంతో పేట్‌బషీరాబాద్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ఒకప్ప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో దక్షిణాది రాష్టాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అలాంటి పోలీసులు ఈ రోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాన ఉందంటే బాధ అనిపిస్తుంది. ఆందోళన కూడా కనిపిస్తుంది.. ప్రభుత్వాలు మారుతుంటాయి. దాంతోపాటు ప్రాధాన్యాతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతిభద్రతలు విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి పాలవుతుందని అనడానికి ఈ రెండున్నర సంవత్సరాలు ఉదాహరణన్నారు.. మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అనగానే రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్నవారిని ట్రాప్ చేయడం తప్పితే ఏం జరగుతుంది రాష్ట్రంలో అనేదానిపై రివ్యూ చేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తెలంగాణ సాధించుకున్నమంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.. పెట్టుబడులు వెల్లువలా రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉపాధి దొరకాలినే ఆలోచనతో ఈ రాష్టాన్ని సాధించుకున్నం అని అన్నారు. ªSష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వానికి ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా హోంమంత్రి దగ్గరకు పరెగెత్తేవాళ్లు. రాష్ట్రంలో హోంమంత్రి లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రే హోం మంత్రి. కానీ ఒక్కోసారి ఆ బాధ్యతను విస్మరించాలరేమో అనిపిస్తుంటుంది. ఎప్ప్పుడు వెళ్లినా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో సవిÖక్ష చేస్తున్నారని ఎప్ప్పుడూ వింటుంటాం. ఏం సవిÖక్ష చేస్తున్నారని.. అనుకుంటే ఒక హోంశాఖ తప్ప మిగితా అన్ని సవిÖక్షలు జరుగుతంటాయి. కానీ కమాండ్ కంట్రోల్‌లో కూర్చొని హోంశాఖను సవిÖక్షించాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదని చెప్ప్పుకోవాల్సి రావడం బాధాకరమైన విషయమన్నారు. కేంద్రమంత్రి కొడుకా.. వేరే వ్యక్తి కొడుకా అని కాదు.. తప్ప్పు చేసినప్ప్పుడు సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయనకు కూడా అదేచట్టం ఉండాలే. ఎవరైతే కంపెí్లయింట్ ఇచ్చారో దాన్ని రిసీవ్ చేసుకోవాలె. కచ్చితంగా పోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే రిపోర్ట్ తీసుకుంటే ఆ అమ్మాయి 17 ఏండ్లు అని విన్నా. కాబట్టి పెట్టాల్సిందే. కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని సబిత అన్నారు.