లగడపాటి చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకుని క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీని మూసివేయాలంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓయూ నాన్ టీచింగ్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాలు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది ప్రముఖులను అందించిదనే అవగాహన లేని లగడపాటి ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. లగడపాటి తెలంగాణాలో తన ఆస్తులను కాపాడుకోవటానికి సమైక్యవాదాన్ని లేవనెత్తుతున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఉద్యోగులకు, విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.



