లైలాఖాన్‌ అస్థిపంజరం లభ్యం

ముంబయి : గత ఏడాది నుండి కనపడకుండా పోయిన బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ అస్థిపంజరం పోలీసులకు లభించినట్లు తెలిసింది. గతరాత్రి నాసిక్‌కు దగ్గర్లోని లైలాఖాన్‌ ఫాంహౌస్‌లో ఆరు అస్థిపంజరాలు లభించినట్టు ,ఇవి లైలాఖాన్‌ ఇంకా వారి కుటుంబసభ్యులవిగా భావిస్తున్నట్లు తెలిపారు. దీన్ని నిర్ధారించుకొవాడానికి లైలా అసలు తండ్రి నాదిర్‌ పటేల్‌ డిఎన్‌ఏతో పోల్చి చూస్తున్నారు. కాగా వీరిని మారు తండ్రి పర్వేజ్‌తక్‌ హతమార్చినట్లు, ఈ విషయాన్ని పోలిసు విచారణలో తెలియజేసి, నేర ప్రదేశాన్ని కూడా ఆయనే చూపించాడని సమాచారం వేరే కేసులో కాశ్మీరులో అరెస్టయిన తక్‌ అనుకోకుండా ఈ హత్యల విషయం బయటపెట్టినట్లు పోలిసులు తెలిపారు.