సాఫ్టవేర్‌ ఉద్యోగులకు టేబుల్‌ టెన్సీస్‌ పోటీలు

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుకు ఆటవిడుపుగా హైదరబాద్‌లోని ఎల్‌బీ స్టేడియాంలో టెన్నీస్‌ పోటీలను నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ విధుల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. ఒలిగర్చ ఎక్స్‌ట్రీం సంస్థను ఏర్పాటు చేసుకున్న కంపెనీలు.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా ఉద్యోగులకు పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. మహీంద్రా సత్యం, డెలాయిడ్‌,ఒరాకిల్‌ తదితర సంస్థల ఉద్యోగుల పలు రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు హాజరయ్యారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ పోటీలను ఆయా సంస్థల విభాగాధిపతులు జ్యోతిప్రజ్వలను చేసి ప్రారంభించారు. సమయాలతో సంబంధం లేకుండా విధులు నిర్వహించే తమలాంటి వారికి క్రీడలు ఎంతో  అవసరమని అన్నారు.