Wednesday, 4 November 2026

అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎం.ఎన్‌

బాగ్‌లింగంపల్లి, జనంసాక్షి: ఆర్టీసీ నష్టాలను గట్టెక్కించేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణ రావు సూచించారు. ఏపీఎన్‌ ఆర్టీసీ ఎస్‌ఎంయూ కార్మిక ప్రతినిధులతో సమాలోచన కార్యక్రమాన్ని ఆత్మీయ పిలుపు పేరిట ఆర్టీసీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్లు తగాదాల జోలికి వెళ్లకుండా నష్టాలను నివారించేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను 23 ఏళ్ల నుంచి ఛైర్మన్‌గా ఉంటూ కార్మికుల అభ్యున్నతికి పాటుపడుతున్నామన్నారు. అప్పటినుంచి ఇప్పటి వరకు పనిచేసిన సంస్థ ఎండీలలో ఏకేఖాన్‌ సమర్థుడైన ఎండీ అని కొనియాడారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ఏకే ఖాన్‌ మాట్లాడుతూ నూతన ఆర్థిక సంవత్సరాన్ని పురస్కరించుకుని సంస్థ కార్మికులు, ఉద్యోగులు దశ,దిశ నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *